E-PAPER

ప్రజా ప్రభుత్వం- ప్రజా బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది

Date : 23 March 2026, 8:25 pm Posted By : PRAJA GONTHUKA

ప్రజా ప్రభుత్వం- ప్రజా బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది

ప్రజా ప్రభుత్వం- ప్రజా బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది

(స్టేషన్ ఘనపూర్)

:ప్రజా గొంతుక డెస్క్: రిపోర్టర్ గుగులోతు రమేష్ నాయక్

మార్చి :23:

తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహద పడే చక్కటి బడ్జెట్ ఇది

గత ప్రభుత్వం 8లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది

బడ్జెట్ లో రెండవ సింహ భాగం అప్పులకు మిత్తిలు కట్టెందుకే ఖర్చు అవుతుంది

ప్రదానంగా సోషల్ సర్వీస్ పైన లక్షా 06వేల కోట్లు ఖర్చు

6గ్యారెంటీల అమలుకు 50వేల 713 కోట్ల కేటాయింపు

వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ నిధుల కేటాయింపు జరిగింది

ప్రతిపక్షాలు ఉనికి కోసమే చౌకబారు విమర్శలు చేస్తున్నారు

ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కొత్త పథకాలకు శ్రీకారం

రాష్ట్రంలోని కోటి 15లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ భీమా పథకం వర్తింపు

ఈ ఏడాది కొత్తగా 2లక్షల పెన్షన్లు మంజూరు

దేవాదులకు 1000కోట్లు కేటాయించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరుతా

రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఊయోగపడే బడ్జెట్ ను రూపొందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ధన్యవాదాలు తెలిపారు

స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ

రాష్ట్ర ప్రభుత్వంఅసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి దోహదడే బడ్జెట్ అని కొనియాడారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 3లక్షల 24వేల కోట్ల బడ్జెట్ లో సోషల్ సర్వీస్ పైన లక్షా 05వేల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రెండవ సింహ భాగం అప్పులకు మిత్తిలు కట్టెందుకే ఖర్చు అవుతున్నాయని అన్నారు. అలాగే 6గ్యారెంటీల అమలుకు 50వేల 713కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు

ప్రతిపక్షాలు ఉనికి కోసమే బడ్జెట్ పై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10ఏళ్ళు అధికారంలో ఉండి 8లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అన్నారు. గడిచిన 12ఏళ్లలో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ కూడా బడ్జెట్ పై విమర్శలు చేయడం విడ్డురంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్దంగా, న్యాయబద్దంగా వచ్చేవి కాకుండా అదనంగా ఒక్క రూపాయి అయినా ఇచ్చారో బీజేపీ మంత్రులు, ఎంపిలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా కొత్త పథకాలకు శ్రీకారం చూడుతోందని తెలిపారు. రాష్ట్రంలోని కోటి 15లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ భీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా ప్రతీ కుటుంబానికి 5లక్షల భీమా సదుపాయం కలగనుందని తెలిపారు. ఈ పథకం దేశంలోనే మొట్ట మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబోతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనన్ని గురుకులాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని, యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు తోడు ఈ విద్యా సంవత్సరం నుండి తెలంగాణ పబ్లిక్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే విద్యా రంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 2లక్షల పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు

ప్రజా ప్రభుత్వంలో ప్రజా బడ్జెట్ రూపొందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి రాష్ట్ర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. సాగు నీటి రంగానికి పెద్ద పీట వేస్తున్న తరుణంలో దేవాదుల పథకానికి 1000 కోట్లు కేటాయించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరానున్నట్లు తెలిపారు. దేవాదుల పనులను పూర్తి చేస్తే 6లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అన్నారు. ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే లక్షా 24వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని దేవాదుల అసంపూర్తి పనులను పూర్తి చేసి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా నిలబెడుతానని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మ, మార్కెట్ డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్