నేడు కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థాన హుండీ లెక్కింపు
భీమదేవరపల్లి మార్చి 24:-
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీరభద్రస్వామి దేవస్థాన హుండీ లెక్కింపును నేడు చేపట్టనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కిషన్ రావు తెలిపారు.నేడు మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో హుండీలను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించనున్నారు.ఈ లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు ఆసక్తి గల భక్తులు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గనాలని ఈఓ తెలిపారు.











