హాలియా మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా కె.రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ........
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:23
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆళ్ల శ్రీనివాస రెడ్డి సెలవులపై వెళ్లిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశాల మేరకు నూతనంగా కె. రవీందర్ రెడ్డి హాలియా మున్సిపాలిటీ కమిషనర్‌గా (ఫస్ట్ అడిషనల్ ఛార్జ్) బాధ్యతలు స్వీకరించారు.
కె. రవీందర్ రెడ్డి ఇంతకు ముందు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ పరిపాలనలో విశేష అనుభవాన్ని సంపాదించారు. హాలియా మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుద్ధ్యం, పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి , వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది నూతన కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
హాలియా పట్టణ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు మరింత వేగవంతం చేయనున్నట్లు నూతన కమిషనర్ తెలిపారు.











