శ్రీరాముడి ఆశీస్సులతో గ్రామం శ్రీరామరక్షగా ఉండాలి
రాములోరి కళ్యాణానికి ఉప సర్పంచ్ కానుక అందజేత
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
శ్రీరాముడి ఆశీస్సులతో గ్రామం శ్రీరామరక్షగా ఉండాలి అని కొన్ని గ్రామ ఉపసర్పంచ్ చల్ల కమలాకర్ అన్నారు. కొన్నే గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గుడి మరమ్మతులకు తన వంతు కానుకగా ₹10, 011రూపాయలు ఆలయ పురోహితులు మిన్నలాపురం హనుమంతరావు మరియు సిద్ధార్థ శర్మ గార్లకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సీత రాముల కళ్యాణ మహోత్సవాన్ని తన వంతు కానుక అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పురపు సిద్ధారెడ్డి . మాజీ ఎంపిటిసి మల్గ నర్సమ్మ సిద్దారములు, రేణుక శ్రీనివాస్, పట్నంశెట్టి భద్రయ్య, ఏంటే శ్రీనివాస్, ఇటికలా అభినయ్, తెలు కిష్టయ్య, ముచ్చంతల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.











