చలివేంద్రాలు ఏర్పాటుతో ప్రజల దాహార్తిని తీర్చవచ్చు...
కట్కూరు,విఎస్ఆర్ నగర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
కట్కూరు,వి ఎస్ ఆర్ నగర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో విఎస్ ఆర్ నగర్ (సోలామైల్ )బస్ స్టాప్ ఎదురుగా ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించిడం జరిగింది అని అలాగే మన గ్రామ వాస్తవ్యుడు కానిస్టేబుల్ గాగిల్లాపురం కరుణాకర్ రెండు నెలల వరకు త్రాగునీరు పూర్తిగా ఉచితంగా ఇస్తానని ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఆటో యూనియన్ అధ్యక్షుడు గుడుగుల రాజు అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కట్కూరు గ్రామ సర్పంచ్ బల్ల రవి,విఎస్ఆర్ నగర్ గ్రామ సర్పంచ్ గొడుగు రేణుక కమలాకర్ హాజరై ప్రారంభించడం జరిగింది.అనంతరం మాట్లాడుతూ ఈ యెక్క కార్యక్రమంనిర్వహించిన ఆటో యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నిడిగొండ శ్రీనివాస్, పుట్ట నర్సింహులు ఏదు కనకయ్య, గంజి గోపాల్, గొడుగు మల్లేశం , చింతల శ్రీనివాస్, గుడుగుల గణేష్, ముషిని మహేష్, గుడుగుల రాజు, గడ్డల భాను బొడ్డు రమేష్, టేకులపల్లి ప్రశాంత్, కళ్యాణం ధనుంజయ్, ఆలేటి రాములు తదితరులు పాల్గొన్నారు...










