చర్ల శాఖ గ్రంధాలయంలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం చర్ల శాఖ గ్రంధాలయంలో కవిత గోష్టి వైభవంగా జరిగింది.ప్రముఖ సామాజికవేత్త సాహితీ ఔత్సాహికులు శ్రీ చింతూరు వెంకటరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన కవితా గోష్టిలో పట్టణానికి చెందిన ప్రముఖ కవులు బత్తుల వెంకటేశ్వర్లు,హైదరాబాద్ రవీంద్ర భారతి,వైజాగ్ యూనివర్సిటీ లో గుర్తింపు పొందిన ఎన్నో సాహిత్య సంస్థల నుండి ఎన్నో అవార్డులను తీసుకొని చర్ల ప్రాంతానికి కవిగా గుర్తింపు తెచ్చినతనసొంతసృజనాత్మకతోసొంతంగాసినీపాటలనుసృష్టిస్తున్నప్రముఖకవి,తెలుగుఉపన్యాసకులు,రచయితతంగెళ్ళపల్లిశంకరాచారి,ప్రముఖ చిత్ర కళాకారులు ఆడెపు ముత్యాల రావు,తమస్వీయకవితలువినిపించారు,సమాజంలోకవితయొక్కప్రాముఖ్యతను మానసిక వికాసానికి కవిత్వం ఇచ్చే ప్రేరణను వారు తమ కవితల ద్వారా వివరించారు,ఈ కార్యక్రమంలో కవితా రసజ్నులు సాహితీ పిపాసి వెంగళ వెంకటరమణ తో పాటుపలువురుపుస్తకప్రియులు,పాఠకులుపాల్గొన్నారు.సాహిత్యంద్వారానేసామాజికచైతన్యంసాధ్యమవుతుందనిఈసందర్భంగావక్తలుఅభిప్రాయపడ్డారు.










