మంగోల్ నుండి భద్రాచలానికి గోటి తలంబ్రాలు, కలశాలతో గోటి తలంబ్రాల ఊరేగింపు
--రామకోటి రామరాజు సేవలు అమోఘం: సర్పంచ్ కర్ణాకర్
సిద్దిపేట మార్చ్ 21 (ప్రజా గొంతుక )
భద్రాచల సీతారాముల కళ్యానానికి అందించే గోటి తలంబ్రాల కార్యక్రమం కోటి తలంబ్రాల దీక్ష శనివారం నాడు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ గ్రామంలో గోటి తలంబ్రాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భద్రాచలం నుండి తీసుకొచ్చిన గోటి తలంబ్రాలు కలశాలలో నింపి రామనామ స్మరణ చేసుకుంటూ గ్రామ పురవీధుల గుండా కాషాయ జెండాలు, కలశాలతో భారీ ర్యాలీతో హనుమాన్ దేవాలయానికి చేరుకొని వడ్లను ఓలిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామకోటి రామరాజు భక్తులచే 3గంటల పాటు రామనామ స్మరణ చేయిస్తూ గోటితో వడ్లను ఓలిచి తలంబ్రాలుగా మార్చారు. భక్తులు అక్కడే రామకోటి రామరాజుకు అందజేశారు. 4సారి కళ్యానానికి 3క్వింటాల గోటి తలంబ్రాలు తెలంగాణ రాష్ట్రం నుండి అందిస్తూన్నామని రామకోటి రామరాజు తెలిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ డి. కర్ణాకర్ మాట్లాడుతూ ఇక్కడి నుండి భద్రాచలానికి గోటి తలంబ్రాలు తీసుకెళ్లడం రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం అన్నారు. మేము భద్రాచలం వెళ్లలేక పోయిన కూడా, మేము ఓలిచే తలంబ్రాలు భద్రాచల కళ్యానానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ కమిటి కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ డి. కర్ణాకర్, ఉప సర్పంచ్ లగిశెట్టి రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, నర్సింహారెడ్డి, బాల్ రాజ్, కనకయ్య, కర్ణాకర్ గౌడ్, వెంకటేశం, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.











