రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 21 మార్చి 2026.
పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు ముస్లిం మైనార్టీ సోదర సోదరిమణులకి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు , పవిత్రమైన రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీ సోదర సోదరిమణులకి ప్రజలకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు,ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి,మంచి మార్గంలో నడవడానికి దోహదపడతాయని అన్నారు.ముస్లిం సోదరులు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి,అందరి జీవితాల్లో ఆనందం,శాంతి,ఆరోగ్యం,ఐశ్వర్యం నిండాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జిల్లా బ్లాక్ మండల కమిటీ నాయకులు , గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు , యువజన కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మైనారిటీ మత పెద్దలు , కార్యకర్తలు పాల్గొన్నారు.











