కుత్బుల్లాపూర్ లోని అర్హులైన ప్రతీ ఒక్క నిరుపేదకు సంక్షేమ పథకాలు అందించిన నాయకులు, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
కుత్బుల్లాపూర్ మార్చ్ 21 ( ప్రజా గొంతుక )
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో శనివారం 131 - కుత్బుల్లాపూర్ డివిజన్ చింతల్ లోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన దాదాపు 123 మంది లబ్ధిదారులకు సుమారు 45.00 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయా డివిజన్లకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్ష, నాయకుల చేతులమీదుగా పంపిణీ చేశారు.
125 - గాజుల రామారం డివిజన్...
గాజుల రామారం డివిజన్ కు చెందిన 11 మంది లబ్ధిదారులకు సుమారు రూ.3,64,500/- ల విలువ గల చెక్కులను......పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, తెలంగాణ సాయి, చెట్ల వెంకటేష్, సమ్మయ్య, ప్రసాద్, శివా నాయక్, లక్ష్మణ్, శేఖర్, మల్లేష్ లబ్ధిదారులకు అందజేశారు.
128 - చింతల్ డివిజన్....
చింతల్ డివిజన్ కు చెందిన 10 మంది లబ్ధిదారులకు సుమారు రూ.3,05,000/- ల విలువ గల చెక్కులను మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, సీనియర్ నాయకులు శేఖర్ రావు, బసవరాజు, వర ప్రసాద్, శ్రీశైలం లు అందజేశారు.
129 - సూరారం డివిజన్...
సూరారం డివిజన్ కు చెందిన 13 మంది లబ్ధిదారులకు సుమారు రూ.5,75,000/- ల విలువ గల చెక్కులను మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎండి. సిద్దీక్, సీనియర్ నాయకులు డాక్టర్ హుస్సేన్, బషీరుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, రఘు, లక్ష్మణ్, అను లు పంపిణీ చేశారు.
130 - సుభాష్ నగర్ డివిజన్...
సుభాష్ నగర్ డివిజన్ కు చెందిన 22 మంది లబ్ధిదారులకు సుమారు రూ.8,04,500/- ల విలువ గల చెక్కులను మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు వలీ, ఎండీ.యూసుఫ్, గుబ్బల లక్ష్మీనారాయణ, ప్రభాకర్, అడపా శేషు, కుంటి మల్లేష్, అరుణా రెడ్డి, రాములు యాదవ్, ప్రభాకర్, విజయ్ లు పంపిణీ చేశారు.
131 - కుత్బుల్లాపూర్ డివిజన్....
కుత్బుల్లాపూర్ డివిజన్ కు చెందిన 15 మంది లబ్ధిదారులకు సుమారు రూ.5,75,000/- ల విలువ గల చెక్కులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు వనం శ్రీనివాస్, ఎండి. నజీరుద్దీన్, జలిగం రాకేష్, కళ్లెం శ్రీనివాస్, రమణా రెడ్డి. ఆంజనేయులు, వెంకటేష్, తదితరులు పంపిణీ చేశారు.
132- జీడిమెట్ల డివిజన్...
జీడిమెట్ల డివిజన్ కు చెందిన 7 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,92,500/- ల విలువ గల చెక్కులను సంపత్ మాధవ రెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎల్లా గౌడ్, కాలే గణేష్, కుంట వేణు, సంపత్ గౌడ్, బాల మల్లేష్, శ్రీకాంత్, జయం చారి, రమేష్, చంద్రశేఖర్ రెడ్డి, జోయెల్ తదితరులు పంపిణీ చేశారు.
జీహెచ్ఎంసీ నిజాంపేట్...
జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ కు చెందిన 4 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,74,000/- ల విలువ గల చెక్కులను మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు బొబ్బ శ్రీను తదితరులు పంపిణీ చేశారు.
జీహెచ్ఎంసీ దుండిగల్....
జీహెచ్ఎంసీ దుండిగల్ సర్కిల్ కు చెందిన 4 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,22,000/- ల విలువ గల చెక్కులను మాజీ కౌన్సిలర్ జక్కుల క్రిష్ణ యాదవ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... కుత్బుల్లాపూర్ లోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించే నాయకులు, మన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అని, గత పన్నండేళ్ళ కాలంలో కోట్లాది రూపాయల నిధులతో ప్రజలకు ఒకవైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ పథకాలు అందించిన నాయకులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.











