సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన శ్రీరామ్ కాలని వాసులు
చౌటుప్పల్ (ప్రజా గొంతుక):
చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగవరం గ్రామంలో సుంకరి సత్తయ్య అకాల మరణం సంభవించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి సత్తయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన శ్రీ రామ్ కాలని వాసులు వారు మాట్లాడుతూ సత్తయ్య అకాల మరణం చాలా బాధాకరమైనదని అన్నారు సత్తయ్య అందరితో మంచిగా కలగలుపుగా ఉండేటువంటి అతని మరణం చాలా బాధ కలిగించిందని అన్నారు. కాలని వాసులు కలిసి క్వింటాల్ బియ్యం సత్తయ్య కుటింబానికి అందజేయడం జరిగినది. కార్యక్రమంలో సిలివేరు రమేష్ పందుల నాగేష్ పులిగిల్ల శ్రీనివాస్ చారి, కొయిగూర రాజేష్, పందుల శరత్ పన్నాల రవి గడ్డం ప్రభాకర్ లింగస్వామి శ్రీరామ్ కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు











