E-PAPER

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు సర్పంచ్ అంజలి గంగాధర్

Date : 20 March 2026, 7:39 pm Posted By : PRAJA GONTHUKA

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు సర్పంచ్ అంజలి గంగాధర్

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు సర్పంచ్ అంజలి గంగాధర్

జగిత్యాల జిల్లా మార్చి 20 ప్రజా గొంతుక న్యూస్

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ (పి డి) గ్రామంలో మతసామరస్యం వెల్లివిరిసింది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, తిరుమలాపురం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కాశ అంజలి గంగాధర్ ఈరోజు గ్రామంలోని మసీదులో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందును చేశారు. ఉపవాస ఏర్పాటు దీక్షలు విరమించిన అనంతరం ముస్లిం సోదరులందరూ ఒకే చోట చేరి ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాశ అంజలి గంగాధర్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తమ పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తూ విందు ఏర్పాటు చేసిన అంజలి గంగాధర్ కు ముస్లిం పెద్దలు మరియు యువకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మస్కం ఆంజనేయులు వార్డు సభ్యులు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్