వల్బపూర్ గ్రామ బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడిగా అంబాల రాహుల్ ఏకగ్రీవ ఎన్నిక
ఎల్కతుర్తి మార్చి 20
ప్రజా గొంతుక:
హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ సూచనలతో వల్బపూర్ గ్రామ బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడిగా అంబాల రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల యూత్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వల్బపూర్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో యూత్ సభ్యులు, సీనియర్ నాయకుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ అంబాల అనిల్‌తో పాటు యూత్ సభ్యులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.











