*పామ్ ఆయిల్ పరిశ్రమ సందర్శించుకున్న మండల రైతులు*
ప్రజా గొంతుక, మార్చి 20:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని తిమ్మాపూర్ ఎల్కతుర్తి క్లస్టర్ సంబంధించిన పలు గ్రామాల రైతులు పారిశ్రామిక రంగంపై అవగాహన పెంపొందించుకునేందుకు పర్యటన చేపట్టారు.
మండల పరిధిలోని చింతలపల్లి దామెర ఇంద్రనగర్ బావుపేట తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మేట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ పరిశ్రమను వీక్షించేందుకు వ్యవసాయ అధికారులైన ఎల్కతుర్తి ఏఓ పున్నం చందర్ ఆధ్వర్యం బయలుదేరినారు .
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీ తో పాటు రైతులు దూకిరే బిక్షపతి సుకినే గోపాలరావు బూసారి వినయ్ కుడుతాడి రమేష్ హింగే శ్రీకాంత్ అంబీర్ చందర్ రావు మదే రాములు క్రాంతి కుమార్ మైస శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు












