నీరుడి రాజు ఎల్లమ్మ బండ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
ఎల్లమ్మ బండ మార్చ్ 20 ( ప్రజా గొంతుక )
పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో నీరుడి రాజు ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడి తయారు చేసి ప్రజలకు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమానికి డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ... ఉగాది పండుగ తెలుగు ప్రజల సాంప్రదాయాలను ప్రతిబింబించే పర్వదినమని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఐక్యంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం ఆయన సుమారు 5 వేల మందికి పైగా స్థానికులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చిన్నోళ్ల శ్రీనివాస్, బుల్లెట్ రవి, హరీష్, వెంకటేష్, యాకయ్య గౌడ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.











