*ఆటో ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు*
ప్రజా గొంతుక,ఎల్కతుర్తి 20: ఉగాదిపర్వదినాన్నిపురస్కరించుకొని మొక్కులు తీర్చుకోవాలనే విశ్వాసంతో జాతరకు కాలినడకన వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంఘటన ఎల్కతుర్తి మండలం పరిధిలోని చింతల పల్లె గ్రామం సమీపంలోని కుమ్మరిండ్ల వద్ద చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దామెర గ్రామం లో ప్రతి ఏడాది నిర్వహించే ఫకీర్ షావలీ జాతరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి కాలినడకన జాతరకు వెళ్తుండగా దామెర గ్రామానికి చెందిన ఓ ఆటో అతివేగంగా ప్రయాణిస్తూ అదుపు తప్పి అతనిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అటుగా వెళ్తున్న భక్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ ద్వారా ఎం జి ఎం ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలుతెలియాల్సి ఉంది.











