E-PAPER

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి

Date : 20 March 2026, 7:10 am Posted By : PRAJA GONTHUKA

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి

శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో పంచాంగ శ్రవణం చేసిన రెంటాల సతీష్ శర్మ

ప్రజా గొంతుక న్యూస్,(మార్చి 19)సూర్యాపేట: ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని శ్రీ రామలింగేశ్వర త్రిశక్తి సహిత అయ్యప్ప, ఆంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రెంటాల సతీష్ శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ శ్రీరామలింగేశ్వర సహిత త్రిశక్తి అయ్యప్ప, ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం శ్రీ పరాభావ తెలుగు ఉగాది సంవత్సర నామ సందర్భంగా పంచాంగ శ్రవణం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది దేశంలో గ్రహణాలు లేవని, పాల ధరలు పెరుగుతాయని, రైతులకు వాణిజ్య పంటలు , బాగా లాభిస్తాయని, ఆక్వా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుందని,సెప్టెంబర్ తర్వాత కొంత దేశానికి ఇబ్బందులు తలెత్తిన ఎదుర్కొని అజయంగా దేశం నిలబడుతుందని తెలిపారు. పిడుగులు, ప్రకృతి విపరీత్యాలు కొంతమేరకు తగ్గుతాయని అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపారు. పాలనలో రాజుకు ఇబ్బందులు ఎదురవుతాయని, పాలకులు సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల అభ్యున్నతికి చర్యలు చేపడతారని అన్నారు. ఏడాది రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుందని అన్నారు. యమునా నది పుష్కరాలు ఉంటాయని, సనాతన ధర్మం, ఆధ్యాత్మిక భావం ప్రజల్లో పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో శ్రీ రామ లింగేశ్వర దేవాలయం కమిటీ చైర్మన్ అనంతుల గణేష్ రామలింగయ్య, ఆలయ ధర్మకర్తలు అనంతల దుర్గాప్రసాద్, సూర్యనారాయణ, శ్రీను, యుగంధర్, అర్చకులు దుర్గాప్రసాద్ శర్మ, సత్యనారాయణ శర్మ, ఆలయ సిబ్బంది వెంకటేశ్వర్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్