జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,మార్చ్19 :
మెదక్ జిల్లా.శివంపేట మండలం,పిల్లుట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనపై నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవీ బాధ్యతలను, అంతఃకరణ శుద్ధితో,బంధు ప్రీతికి తలవంచకుండా పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేస్తానని జిల్లా పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి,పార్టీ అభివృద్ధికి,సంక్షేమానికి అహర్నిశలు కృషిచేస్తానని బండారి గంగాధర్ అన్నారు.











