E-PAPER

స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశాల బ్రోచర్ ను ఆవిష్కరించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

Date : 20 March 2026, 7:01 am Posted By : PRAJA GONTHUKA

స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశాల బ్రోచర్ ను ఆవిష్కరించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశాల బ్రోచర్ ను ఆవిష్కరించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్

(మార్చి :19:)

స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం రూపొందించిన బ్రోచర్‌ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండ కనకదుర్గ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలోనే చేరి తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ కళాశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ

స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉచిత కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు వంటి సదుపాయాలు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరి మంచి అవకాశాలను పొందాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, టీఎస్కేసీ (TSKC) ద్వారా ఉద్యోగావకాశాల కల్పన, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, పోటీ పరీక్షల మార్గదర్శకత్వం వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బత్తిని చంద్రమౌళి మరియు అధ్యాపకులు నాగరాజు సుమలత, అఖిల తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్