E-PAPER

ఐఎన్టియుసి పేరుతో చట్ట విరుద్ధ కార్యకలాపాలు – చర్యలు తీసుకోవాలి: నడికుడ శివ డిమాండ్

Date : 20 March 2026, 6:49 am Posted By : PRAJA GONTHUKA

ఐఎన్టియుసి పేరుతో చట్ట విరుద్ధ కార్యకలాపాలు – చర్యలు తీసుకోవాలి: నడికుడ శివ డిమాండ్

ఐఎన్టియుసి పేరుతో చట్ట విరుద్ధ కార్యకలాపాలు – చర్యలు తీసుకోవాలి: నడికుడ శివ డిమాండ్

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చి19:)*

రంగారెడ్డి జిల్లా:ఐఎన్టియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.మహేశ్వరం నియోజకవర్గ కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ మాట్లాడుతూ,ఐఎన్టియుసికి అనుబంధంగా లేని హైదరాబాద్ రంగారెడ్డి రైస్ మిల్స్ అండ్ రైస్ ట్రేడర్స్ వర్కర్స్ యూనియన్ (A4516) గత కొంతకాలంగా కార్మికుల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఈ యూనియన్,హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని, కార్మికులకు రావలసిన న్యాయమైన గిట్టుబాటు ధరలు మరియు ఇతర హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. అదేవిధంగా,తాము ఐఎన్టియుసికి అనుబంధమని తప్పుడు ప్రచారం చేస్తూ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమావేశంలో తీవ్రంగా ఖండించారు.ఇలాంటి చర్యలను అరికట్టేందుకు సంబంధిత యూనియన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా లేబర్ అధికారిని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బిజ్జుల రామకృష్ణారెడ్డి,సామ భాస్కర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కన్వీనర్,ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రవణ్ కుమార్,ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు ఐలేష్ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్