ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం......
హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:19
ఉగాది పండుగ శుభ సందర్భంగా నేడు హాలియా మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పేదలకు గృహవసతి కల్పించడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన నివాసాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఉగాది పర్వదినాన గృహప్రవేశాలు జరగడం లబ్ధిదారులకు మరింత ఆనందాన్ని కలిగించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 45 ఇండ్ల గృహప్రవేశాలు విజయవంతంగా నిర్వహించబడినవి. లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మరియు మున్సిపాలిటీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ , మున్సిపల్ టి పి ఎస్ ,2 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు నకిరేకంటి సైదులు , 3 వ వార్డు కౌన్సిలర్ కుందూరు వెంకటరెడ్డి,4 వ వార్డు కౌన్సిలర్ కడమంచి ప్రమీల, 5 వ వార్డు కౌన్సిలర్ చిట్టిపోలు శ్రీదేవి ,8 వ వార్డు కౌన్సిలర్ గౌహర్ జబీన్ ,9 వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు,10 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు పిల్లి ఆంజనేయులు ,11 వ వార్డు కౌన్సిలర్ డి. ప్రసాద్ బాబు,12 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎడవల్లి రంజిత్ గార్లు మరియు హౌసింగ్ విభాగం అధికారులు,వార్డ్ ఆఫీసర్లు సంబంధిత వార్డుల ప్రజా ప్రతినిధులు, స్థానిక పెద్దలు, సిబ్బంది, మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీ మరియు హౌసింగ్ శాఖ అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు.












