పైపులైన్ లీకేజ్ కావడంతో మరమ్మత్తు చేపిస్తున్న సర్పంచ్
రాయపర్తి, మార్చి 19 ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి (దొంతరబోయిన అనిల్) వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హై స్కూల్ ప్రాంగణం వద్ద వాటర్ పైప్ లైన్ లీకేజ్ కావడంతో తక్షణమే మరమత్తు చేయించిన గ్రామ స్థానిక సర్పంచ్ బరిగల బాబు దిశ పవర్ న్యూస్ తో మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని తెలిపారు, గ్రామాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయం అని తెలిపారు, ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్లు దోకుడు సోమేందర్, గడ్డం నరేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,












