శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు – భక్తులకు వేదాశీర్వచనంతో శుభాశీస్సులు
సదానిరంజన్ సిద్ధాంతి ఆలయ అర్చకులు,ప్రజా గొంతుకఎల్కతుర్తి మార్చి18,తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ప్రారంభమవుతున్న శ్రీ పరాభవ నామ సంవత్సరం (2026–2027) కు వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ స్వామి దేవస్థానం ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి భక్తులకు హృదయ పూర్వక శుభాకాంక్షలుతెలిపారు.ఉగాదిపండుగతోనేకొత్తతెలుగుసంవత్సరం ప్రారంభమవుతుందని,ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరంఅనిపంచాంగంలోపేర్కొనబడిందనితెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఆలయాలలో పంచాంగ శ్రవణం నిర్వహించడం సంప్రదాయమని, భక్తులు దేవుని దర్శనం చేసుకుని వేదాశీర్వచనాలు పొందడం ద్వారా సంవత్సరాన్ని శుభంగా ప్రారంభించుకోవాలని సూచించారు. ఉగాది పండుగ వసంత ఋతువు ఆరంభాన్ని సూచించే పర్వదినంగా భావించబడుతూ, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలకు శ్రీకారం చుట్టే రోజు అని వివరించారు.శ్రీ పశుపతినాథ్ స్వామి అనుగ్రహంతో ఈ నూతన సంవత్సరంలో భక్తులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సంతోషాలు కలగాలని ఆయన ప్రార్థించారు. సమాజంలో సత్సంకల్పాలు పెరిగి, ప్రజలందరూ ధర్మమార్గంలో నడుచుకుంటూ సుఖసంతోషాలతో జీవించాలని వేదమంత్రాలతోఆశీర్వదించారుఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు మరియు యావత్ ప్రజానీకానికి శ్రీపరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు సనాతన సంప్రదాయాలను పాటిస్తూ ఆధ్యాత్మికతతో జీవించాలని కోరారు.












