E-PAPER

హోటళ్లపై సివిల్ సప్లై ఆకస్మిక తనిఖీలు: నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదు!

Date : 18 March 2026, 3:36 pm Posted By : PRAJA GONTHUKA

హోటళ్లపై సివిల్ సప్లై ఆకస్మిక తనిఖీలు: నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదు!

హోటళ్లపై సివిల్ సప్లై ఆకస్మిక తనిఖీలు: నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదు!

ప్రజా గొంతుక, బచ్చన్నపేట మండలం

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బచ్చన్నపేట మండలంలోని పలు హోటళ్లు, దాబాలపై సివిల్ సప్లై అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ సిలిండర్లను కమర్షియల్ అవసరాల కోసం వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు, పలు సిలిండర్లను సీజ్ చేశారు. జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, కేవలం కమర్షియల్ సిలిండర్లను మాత్రమే హోటళ్లలో వాడాలని, సామాన్య ప్రజలకు అందాల్సిన రాయితీని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వ్యాపార సంస్థల్లో గృహ వినియోగ సిలిండర్ల వాడకంపై సివిల్ సప్లై అధికారులు ఈ క్రింది హెచ్చరికలు జారీ చేశారు: చట్టపరమైన చర్యలు: గృహ వినియోగ సిలిండర్లను వ్యాపారాలకు వాడటం నిత్యావసర వస్తువుల చట్టం (Essential Commodities Act, 1955) ప్రకారం నేరం.జైలు శిక్ష: ఈ నేరం రుజువైతే కనిష్టంగా 3 నెలల నుండి గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ స్థాయిలో జరిమానా విధించడమే కాకుండా, వారి పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్‌ను శాశ్వతంగా రద్దు చేస్తారు. తనిఖీల్లో మండల ఆర్‌ఐఓ వంశీకృష్ణ, జీపీఓ రామకృష్ణ, సిబ్బంది సంపత్, ఐశ్వర్య ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ  పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :