మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి
ప్రజా గొంతుక న్యూస్,(మార్చి17) సూర్యాపేట: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.మంగళవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ మదీనా మసీద్ వద్ద ముస్లింలకు పిఆర్టియు జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, పిఆర్టియు ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ ముస్లిం సోదరులకు పవిత్ర మాసమన్నారు.రంజాన్ మాసంలో ముస్లింలు సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని రోజా విరమించే సాయంత్రపు భోజనాన్ని ఇఫ్తార్ విందు అంటారని,ఇది ఖర్జూరాలు,నీరు లేదా పండ్లతో మొదలై సాంప్రదాయ వంటకాలతో కూడిన రుచికరమైన విందుగా మారుతుందన్నారు.కుటుంబ సభ్యులు,స్నేహితులు సమాజంతో కలిసి భోజనం చేయడం,పరస్పర స్నేహభావం,ఐక్యతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, కౌన్సిలర్ జహీర్, పి ఆర్ టి యు నాయకులు బోలికొండ కోటయ్య, కందుకూరి శివశంకర్, పప్పు వీరబాబు, చింతరెడ్డి రామలింగారెడ్డి, కొనతం వెంకటరెడ్డి, దండుగుల ఎల్లయ్య, అల్లరి సత్యనారాయణ, శంకర్ ప్రసాద్,ఎంఈఓ సలీం షరీఫ్, జమాల్ షరీఫ్, కలీం అహ్మద్ ఖాన్, షేక్ బషీర్, జహీర్ తదితరులు పాల్గొన్నారు












