దేవాలయం వద్ద వేసిన కంచెను తొలగించాలని హైడ్రా కమీషనర్ కు విజ్ఞప్తి
కుత్బుల్లాపూర్ మార్చ్ 17 (ప్రజా గొంతుక )
హైడ్రా కమిషనర్ను కలిసిన జర్నలిస్టు కాలనీ అసోసియేషన్ నేతలు నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ (ఐపీఎస్) ను కలిసి నిజాంపేట్ జర్నలిస్టు కాలనీలోని లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వేసిన ఫెన్సింగ్ ను తొలగించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా జర్నలిస్టు కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్ సమస్యను వివరిస్తూ జర్నలిస్టు కాలనీ లో గల లక్ష్మీ గణపతి ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నందున ఆలయానికి సంబంధించిన స్థలంలో ఇటీవల హైడ్రాధికారులు ఫెన్సింగ్ వేశారని వివరించారు. ఇదే విషయమై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కు గతంలోనే ఆలయానికి, అసోసియేషన్ కార్యాలయానికి స్థలం కేటాయించాలంటూ అభ్యర్థనలు కూడా పంపించినట్లు హైడ్రా కమిషనర్ కు వివరించారు. దీంతో నిజాంపేట జర్నలిస్టు కాలనీలోని లక్ష్మీ గణపతి ఆలయానికి ఆనుకుని ఉన్న కొంత భాగం ఫెన్సింగ్ ను తొలగించి తాత్కాలికంగా భక్తుల అన్నదానం కోసం ఉపయోగించుకునేటట్లు బాచుపల్లి రెవెన్యూ అధికారులకు తాను సూచనలు ఇస్తానని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ని కలిసిన వారిలో కాలనీ ఉపాధ్యక్షుడు ముక్క దేవేందర్ గుప్తా, గోవిందరావు, దామెర జగదీశ్వర్ గుప్తా, సిటీ కేబుల్ సత్యనారాయణ, పి మల్లికార్జున్ , కే సతీష్ తదితరులు ఉన్నారు.












