గుడుంబా, బెల్ట్ షాప్ నిర్వాహకులను తాసిల్దార్ ముందు బైండోవర్ చేసిన ఎక్సైజ్ ఎస్ ఐ..
ప్రజా గొంతుక ( మార్చి 17 )కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్, సంబంధిత అధికారులు వేరువేరుగా దాడులు చేసి పలువురుని అదుపులోకి తీసుకొని తాసిల్దార్ జగదీశ్వరరావు ముందు బైండోవర్ చేశారు.గంగారం గ్రామనికి చెందిన బైరీ మమత బెల్టు షాప్ నిర్వాహకుల పైన పెద్దపల్లి టాస్పోర్ట్ ( DTF) జిల్లా అధికారి పావని, మమత పై కేసు నమోదు చేయగా, సుల్తానాబాద్ ఎక్సైజ్ ఎస్సై చిరంజీవి తాసిల్దార్ మందు చేసినట్లు వారు తెలిపారు. అలాగే జాఫర్ ఖన్ పేటకు చెందిన రాయిశెట్టి కనకమ్మ, పెద్దంపేటకు చెందిన దుప్ప సారమ్మను,కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన రానివేన రాజనర్సు, తాసిల్దార్ జగదీశ్వరరావు ముందు హాజరు పరిచిన వారిలో ఉన్నారు. లక్ష రూపాయల పూచికత్తు పై విడుదల చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై చిరంజీవి తెలిపారరు. వారి వద్ద నుంచి1:26 లీటర్ల లిక్కర్ మందును సీజ్ చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్న సంబంధిత అధికారులు జిల్లా టాస్క్ఫోర్స్ అధికారి పావని,హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, సిబ్బంది తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.












