ఈత ను పాఠ్యంశాల్లో చేర్చాలని 10 సంవత్సరాలనుండి ప్రయత్నిస్తున్న కోలా రవీందర్
కుత్బుల్లాపూర్ మార్చ్ 17 ( ప్రజా గొంతుక )
ఈత ఒక సాధన అని పాఠ్యాంశంలో చేర్చాలా వద్దా ఒకసారి ఆలోచించండి ఇది 10 సంవత్సరాల పోరాటం అమాయకమైన యువకులు చనిపోతున్నారని ఇకనైనా విద్యాశాఖ మేల్కొని ఈత నేర్చుకున్న వారికి రెండు మార్పులు ఇస్తామని పాఠశాలలకు తెలియపరచాలని ఈత ఒక సాధన అని తీరి చెప్పాలని ప్రాక్టికల్ వారు వారి తల్లిదండ్రులు నేర్పుతారని ఇకనైనా భావితరాల కొరకు యువకులను కాపాడుకుందామని సంతానం కావాలంటే ఒక తల్లి కానరాని రాయికి మొక్కుతుందని చెట్టుకు పుట్టకు మొక్కుతుందని, అలాంటి సంతానం ఈత రాక చనిపోతే, ఈతమీద అవగాహన లేక ప్రాణాలు కోల్పోతే తల్లిదండ్రుల గర్భశోకం వర్ణించలేమని ప్రభుత్వ ఉద్యోగులారా నాయకులారా విద్యాశాఖ ఉన్నత అధికారులారా ఆలోచించి ఈతను పాఠ్యంశాల్లో చేర్చి చిన్నప్పటినుండే ఈత వచ్చే విదంగా ప్రోత్సహించాలని పర్యావరణ ప్రేమికులు కోలా రవీందర్ ముదిరాజ్ కోరారు.












