మల్లారెడ్డి క్రికెట్ ట్రోఫీలో ఫైనల్ కు చేరిన కుత్బుల్లాపూర్ జట్టు
కుత్బుల్లాపూర్ మార్చ్ 17 ( ప్రజా గొంతుక )
మల్లారెడ్డి క్రికెట్ ట్రోఫీ పోటీలలో కుత్బుల్లాపూర్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది. జరిగిన మ్యాచ్‌లో కుత్బుల్లాపూర్ జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఆటతీరును ప్రదర్శించి ప్రత్యర్థి జట్టుపై ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కుత్బుల్లాపూర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. జట్టు ఆటగాళ్లు సమష్టిగా రాణిస్తూ జట్టుకు పోటీకి సరిపడే స్కోర్ అందించారు.
128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మల్కాజ్గిరి జట్టు కుత్బుల్లాపూర్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కుత్బుల్లాపూర్ జట్టు మల్కాజ్గిరి జట్టును కేవలం 64 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో కుత్బుల్లాపూర్ జట్టు భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌లో కుత్బుల్లాపూర్ జట్టు అత్యధిక పరుగులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై అభిమానులు, స్థానిక క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.












