అధిక ఎండ నుండి పశువులను కాపాడుకోవాలి..
పశువులను కాపాడుకోవడం రైతుల బాధ్యత...
ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్..
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం, ఆలింపురం గ్రామంలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ను గ్రామ సర్పంచ్ పాకాల నాగలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పాడి రైతులు మూడు నెలలు నిండిన ప్రతిపశువులకుఉచిితగాలికుంటునివారణటీకాలువేయించుకోవాలని పశువైద్య సిబ్బందికి సహకరించాలని చెప్పడం జరిగింది. మండల పశు వైద్యఅధికారి డాక్టర్ ఎం నాగప్రసాద్ మాట్లాడుతూ పాడి రైతులుపశువులనుఎండాకాలంలో జాగ్రత్తలు పాటించి ,ఈ ఎండాకాలం నుండి రైతులందరూ పశువులకు పచ్చి గడ్డిని మరియు మినరల్ మిక్సర్ రైతులు వాడగలరని సూచించడం జరిగింది .ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ బంటు విద్యాసాగర్, మరియు పశు వైద్య సిబ్బంది ఎల్ ఎస్ ఏ ఎం శ్రీధర్ బాబు, జనగామ జిల్లా గోపాలమిత్ర అధ్యక్షులు వై ఆంజనేయులు,గోపాలమిత్ర ఈ రాజు,పాడి రైతులు బంటు గోవర్ధన్,పిట్ట మహేందర్ రెడ్డి, దిడిగే కేశవులు, చల్ల రాజిరెడ్డి, పిట్టల చంద్రమౌళి ,సంతోష్ రెడ్డి, పాడి రైతులు పాల్గొనడం జరిగింది.












