E-PAPER

ఫీజు రీయింబర్స్ బకాయిలు విడుదల చేయాలి 

Date : 16 March 2026, 8:08 pm Posted By : PRAJA GONTHUKA

ఫీజు రీయింబర్స్ బకాయిలు విడుదల చేయాలి 

ఫీజు రీయింబర్స్ బకాయిలు విడుదల చేయాలి

టిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

ప్రజా గొంతుక న్యూస్, (మార్చి 16)సూర్యాపేట:ప్రభుత్వం విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి గంజికుంట్ల గోపినాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల విడుదలను కోరుతూ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ సముదాయాల కార్యాలయంలో వారు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ని కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసి పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.బకాయిలు చెల్లించక పోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు తమకి జీతాలు చెల్లించే పరిస్థితి లేదన్నారు. దీనివల్ల తమ కుటుంబాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు.దీనితో తాము మానసికంగా,శారీరకంగా ఎంతో జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా తమ ఇబ్బందులను గమనించి విడుదల చేయాలని, లేని యెడల చేయకపోతే ఏప్రిల్ 1 నుండి తరగతులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందించిన అధ్యాపకులు ధనుంజయ్ చారి,విజయ్ చందర్,భాషపంగు సునిల్ కుమార్,ఇటీకాల రాజబాబు,విజయ్ కుమార్,సాయి కుమార్,రవి,అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్