*పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ.*
*-పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్.*
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో ఉచిత గాలికూంటూ వ్యాధినివారణ టీకాల శిబిరం పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల్ శిరీష రాజశేఖర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.పాల్వాయి పశువై ద్య అధికారిని డా.ఉష మాట్లాడు తూ..గాలికుంటూ వ్యాధి వచ్చిన పశువుల నోటిలో,గిట్టల మధ్యలో పుండ్లు కావటం చోంగ కారటం, పశువు మేత తినకపోవటం, జ్వ రం ఉండటం వంటి లక్షణాలు కని పిస్తాయి.వ్యాధి లక్షణాలు నోరు మరియు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి, అవి 24 గంటల్లో చితి కిపోయి పొక్కులు మరియు పుండ్లుగా మారి నొప్పి వలన పశువులు మేత మరియు నీరు తీసుకోక నీరసించి చనిపోతా యి.నోటి నుంచి చొంగ కారు తుంది.పాల దిగుబడి గణనీ యంగా తగ్గిపోతుందని,గిట్టలలో పుండ్ల వలన ఎద్దులు వ్యవసాయ పనులు చేయలేవని,అపుడప్పుడు మరణాలు కూడా సంభవిచటం జ రుగుతుందని.కాబట్టి గాలి కుంటూ వ్యాధి రాకుండా ముందుగానే టీకా లు వేయించుకోవాలని 10/03 /2026 నుండి 09/04/2026 వరకు టీకాలు వేయడం జరుగు తుందని రైతులకు వివరించా రు.గ్రామ సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పశువులకు టీకా లు వేయడం జరిగినది.ఈ కార్య క్రమంలో భాగంగా 54 గో జాతి పశువులకు మరియు 28 గేదెలకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు వేయటం జరిగిందని. సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పశుపోషకు లు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయిం చాలన్నారు,రోగాల బారి నుంచి తమ పశువులను రక్షించాలని సూచించారు.ప్రభుత్వం ద్వారా చేపట్టిన ఈ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం పశుపోషకులు సద్వినియోగం చే సుకోవాలని కోరారు. ఈ కార్యక్ర మంలో ఉప సర్పంచ్ లక్ష్మీ నరసిం హ, వార్డ్ మెంబర్స్ ,పశు వైద్య సిబ్బంది మధులుపాల్గొన్నారు.












