E-PAPER

అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి – పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి

Date : 16 March 2026, 7:35 pm Posted By : PRAJA GONTHUKA

అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి – పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి

అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి - పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి

-సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

కుత్బుల్లాపూర్ మార్చ్ 16 ( ప్రజా గొంతుక )అమెరికా ఇజ్రాయేల్ చేస్తున్న యుద్ధలు ఆపాలని,యుద్ధం వల్ల పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని కోరుతూ నేడు రాష్ట్ర పార్టీ పిలుపు లో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట అవుట్ పోస్ట్ వద్ద ఖాళీ గ్యాస్ సిలిండర్ లను ప్రదర్శించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.   ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ... ప్రపంచంలోని అన్ని దేశాలు తన గుప్పెట్లో ఉండాలని అన్ని సంపదలన్నీ అమెరికా చేతిలో ఉండాలని భావిస్తూ ట్రంప్ చేస్తున్న యుద్దోన్మాద చర్యలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఖండిస్తున్నారని ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిరసనలు ప్రదర్శనలు చేస్తున్నారని అందులో భాగంగానే సిపిఐ ఆధ్వర్యంలో "యుద్దోన్మాదం నశించాలి -ప్రపంచ శాంతి వర్ధిల్లాలి" యుద్ధం వల్ల పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలను నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, గ్యాస్ సరఫరా లో జరుగుతున్నటువంటి ఆలస్యాన్ని అరికట్టాలని, బుక్ చేసిన వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.కొంతమంది దీన్ని అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గా భావిస్తూ మనకి ఏమి సంబంధం లేదని మనకు ఏలాంటి నష్టం లేదని భావించి యుద్ధం వద్దన్న వాళ్లను ఇరాన్ వెళ్ళండి అన్నవాళ్లు గ్యాస్ ధర పెరిగితే యుద్ధం వల్ల పెరిగిందని సమాధానాలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని యుద్ధము ఎక్కడ జరిగినప్పటికీ అంతిమంగా నష్టపోయేది 99% ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలే కాబట్టి వెంటనే అశాంతికి కారణమైతున్నటువంటి యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేదని ప్రగల్బాలు పలుకుతున్నప్పటికీ అసలు గ్యాస్ బుకింగ్ కావట్లేదని ఒకవేళ బుకింగ్ అయితే సిలిండర్ పైన 100 నుండి 200 వరకు అదనంగా వసూలు వసూలు చేస్తున్నారని కావున ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజలు ఎదురుకుంటున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకొని మాట్లాడాలని ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అబద్ధాలు మాట్లాడితే ప్రజలు తిరగబడతారని కావున ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి తక్షణ సమస్య అయినటువంటి ధరల పెరుగుదలను అరికట్టాలని డిమాండ్ చేసారు.  ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు హైమావతి, పార్టీ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వి శ్రీనివాస్, మండల కోశాధికారి సదానంద్, శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, శాఖ సభ్యులు ఇమామ్ రవి, సామెల్,కొండయ్య, విజయ్, యాదగిరిలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి – పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి

-సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

కుత్బుల్లాపూర్ మార్చ్ 16 ( ప్రజా గొంతుక )అమెరికా ఇజ్రాయేల్ చేస్తున్న యుద్ధలు ఆపాలని,యుద్ధం వల్ల పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని కోరుతూ నేడు రాష్ట్ర పార్టీ పిలుపు లో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట అవుట్ పోస్ట్ వద్ద ఖాళీ గ్యాస్ సిలిండర్ లను ప్రదర్శించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.   ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ… ప్రపంచంలోని అన్ని దేశాలు తన గుప్పెట్లో ఉండాలని అన్ని సంపదలన్నీ అమెరికా చేతిలో ఉండాలని భావిస్తూ ట్రంప్ చేస్తున్న యుద్దోన్మాద చర్యలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఖండిస్తున్నారని ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిరసనలు ప్రదర్శనలు చేస్తున్నారని అందులో భాగంగానే సిపిఐ ఆధ్వర్యంలో “యుద్దోన్మాదం నశించాలి -ప్రపంచ శాంతి వర్ధిల్లాలి” యుద్ధం వల్ల పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలను నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, గ్యాస్ సరఫరా లో జరుగుతున్నటువంటి ఆలస్యాన్ని అరికట్టాలని, బుక్ చేసిన వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.కొంతమంది దీన్ని అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గా భావిస్తూ మనకి ఏమి సంబంధం లేదని మనకు ఏలాంటి నష్టం లేదని భావించి యుద్ధం వద్దన్న వాళ్లను ఇరాన్ వెళ్ళండి అన్నవాళ్లు గ్యాస్ ధర పెరిగితే యుద్ధం వల్ల పెరిగిందని సమాధానాలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని యుద్ధము ఎక్కడ జరిగినప్పటికీ అంతిమంగా నష్టపోయేది 99% ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలే కాబట్టి వెంటనే అశాంతికి కారణమైతున్నటువంటి యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేదని ప్రగల్బాలు పలుకుతున్నప్పటికీ అసలు గ్యాస్ బుకింగ్ కావట్లేదని ఒకవేళ బుకింగ్ అయితే సిలిండర్ పైన 100 నుండి 200 వరకు అదనంగా వసూలు వసూలు చేస్తున్నారని కావున ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజలు ఎదురుకుంటున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకొని మాట్లాడాలని ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అబద్ధాలు మాట్లాడితే ప్రజలు తిరగబడతారని కావున ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి తక్షణ సమస్య అయినటువంటి ధరల పెరుగుదలను అరికట్టాలని డిమాండ్ చేసారు.  ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు హైమావతి, పార్టీ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వి శ్రీనివాస్, మండల కోశాధికారి సదానంద్, శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, శాఖ సభ్యులు ఇమామ్ రవి, సామెల్,కొండయ్య, విజయ్, యాదగిరిలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్