ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పించాలి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్
కుత్బుల్లాపూర్ మార్చ్ 16 ( ప్రజా గొంతుక )బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించకుండా గవర్నర్ నోటి వెంట అవాస్తవాలు చెప్పించడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాక్ఔట్ చేసిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అనంతరం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అమర వీరుల స్తూపం వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












