నూతన సీసీ రోడ్డు ప్రారంభంకు కొబ్బరికాయ కొట్టిన సర్పంచ్ జేజ్జరీ మానస రామకృష్ణ
వెంకటాపురం // ప్రజాగొంతుక // మార్చి :15// ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పుడు వీరాపురం గ్రామపంచాయతీ పరిధిలోని వెంగళరావుపేట గ్రామంలో ఆదివారం నూతన సీసీ రోడ్డును ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ జజ్జరి మానస రామకృష్ణ, ఉప సర్పంచ్ గుండెల ప్రశాంత్,వార్డు సభ్యురాలు వేల్పుల తిరుపతమ్మ కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిడం మోహన్రావు పాల్గొన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ యువనాయకులుబాలసానివేణు,కిరణ్నాగేశ్వరరావు,సాగర్,కృష్ణ,మల్లేష్, వినోద్, వేల్పుల నవీన్ తదితరులు హాజరయ్యారు.గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో రోడ్డును ప్రారంభించడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ సీసీ రోడ్డును నిర్మించినట్లు నాయకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.గ్రామస్తులు నూతన సీసీ రోడ్డు నిర్మాణంపై సర్పంచ్ మరియు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.












