E-PAPER

గ్రామ అభివృద్ధి కోసం మాట ఇచ్చా..బండనాగారం అభివృద్ధే నా లక్ష్యం…

Date : 15 March 2026, 1:45 pm Posted By : PRAJA GONTHUKA

గ్రామ అభివృద్ధి కోసం మాట ఇచ్చా..బండనాగారం అభివృద్ధే నా లక్ష్యం…

గ్రామ అభివృద్ధి కోసం మాట ఇచ్చా… బండనాగారం అభివృద్ధే నా లక్ష్యం...

ఎన్నికల హామీలు నెరవేరుస్తున్న సర్పంచ్ ఇజ్జగిరి  రాములు

ప్రజా గొంతుక బచ్చన్నపేటమండలంలోని బండనాగారం గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సర్పంచ్ ఇజ్జగిరి రాములు అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామ ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమని, గ్రామ అభివృద్ధే తన శ్వాస అని ఆయన తెలిపారు.సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల లోపే గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం విశేషం. శివరాత్రి కనకయ్య ఇంటి నుండి కుంచం మల్లయ్య ఇంటి వరకు వడ్డెరుల ఎల్లమ్మ గుడి సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.ఇక గ్రామంలో మహిళా సమాఖ్య భవనం లేక మహిళలు చెట్ల కింద సమావేశాలు నిర్వహించాల్సి వస్తున్న పరిస్థితిని గమనించిన సర్పంచ్ ఇజ్జగిరి రాములు, మహిళా సమైక్య భవనం నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు తీసుకొని పనులను ప్రారంభించారు. ఈభవనం త్వరలో పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి చెప్పాలని ఆయన కోరారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మల్లయ్య, గ్రామ సెక్రటరీ టి. ప్రశాంత్, వార్డు సభ్యులు ఆరేళ్ల భాస్కర్, శ్రీధర్ రెడ్డి, విజయ, పద్మ, బాలలక్ష్మి, నరేష్, ఇజ్జగిరి పరుశరాములు, రామకృష్ణ, వడ్డే ఐలయ్య, వడ్డే ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

గ్రామ అభివృద్ధి కోసం మాట ఇచ్చా… బండనాగారం అభివృద్ధే నా లక్ష్యం…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్