లక్ష్మాపురం అభివృద్ధికి ఎమ్మెల్యేను కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు
అండర్ డ్రైనేజీ నిర్మాణానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామ అభివృద్ధి కోసం గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో వర్షాకాలం సమయంలో మురుగు నీరు వీధుల్లోనే నిలిచిపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితులు నెలకొంటున్నాయని వారు వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అత్యవసరమని కోరుతూ రూ.19 లక్షల వ్యయంతో రూపొందించినఎస్టిమేషన్ కాపీని ఎమ్మెల్యేకు అందజేశారు.గ్రామ ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ విషయంపై సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్పందనతో లక్ష్మాపురం గ్రామ ప్రజల్లో ఆశాభావం వ్యక్తమైంది.ఈ కార్యక్రమంలో లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ కల్పన రాజిరెడ్డి, ఉపసర్పంచ్ పిడుగు మహేష్, వార్డు సభ్యుడు ఇమ్మడి లోకేష్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












