సీఎం పర్యటనకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు -
పర్యవేక్షించిన డీఐజీ ఎల్.ఎస్. చౌహన్.
గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి కుమారుడి వివాహ మహోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు, పలువురు మం త్రులు మరియు ప్రజాప్ర తినిధులు శనివారం గద్వాలలో పర్యటిం చారు.ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ శాఖ పటి ష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వ హించడంలో కీలక పాత్ర పోషిం చింది.ముఖ్యమంత్రి రాక నేప థ్యంలో ఉదయం నుంచే హెలిపాడ్ నుండి కళ్యాణ వేదిక వరకు ఉన్న మార్గమంతా పోలీసులు కట్టుది ట్టంగా భద్రతా బందోబస్తు ఏర్పా టు చేశారు. ముఖ్య కూడళ్ల వద్ద అదనపు పోలీస్ సిబ్బందిని మోహ రించడంతో పాటు, కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమ లు చేశారు. కార్యక్రమ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యే క పర్యవేక్షణ చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిం చారు.శనివారం మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా గద్వాలకు చేరుకోగా, కలెక్టరేట్ సమీపం
లోని హెలిపాడ్ వద్ద జిల్లా కలె
క్టర్ రిజ్వాన్ బాషా షేక్ గారు, జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్.
ఎస్. చౌహాన్ గారు, జిల్లా ఎస్పీ
టి శ్రీనివాసరావు మరియు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రిని ఘనంగా స్వాగతించారు.
డీఐజీ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేపట్టిన సమగ్ర పోలీస్ బందోబస్తు కారణంగా ముఖ్యమంత్రి పర్యటన ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా, ప్రశాంతంగా కొనసాగింది. పోలీస్ శాఖ సమన్వయంతో చేపట్టిన భద్రతా చర్యలు, పర్యటన విజ యవంతంగా ముగియడంలో ప్రధాన పాత్ర పోషించాయి.












