అంగన్వాడి కేంద్రాల పరిశీలన – పిల్లలకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం ఇవ్వాలి:
1వ వార్డు కౌన్సిలర్ తిరుమలేష్
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo అయిజ మున్సిపాలిటీ చైర్మన్ సీఎం సురేష్ ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ మాల నర్సింహులు సూచన మేరకు, ఒకటో వార్డు కౌన్సిలర్ కే. తిరుమలేష్ శనివారం రోజు అంగన్వాడి కేంద్రాలను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అందే ఆహారం, పరిశుభ్రత, సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.పిల్లల ఆరోగ్యం కోసం నాణ్యమైన పోషకాహారం, సమయానికి భోజనం అందించాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలకు గుడ్లు, పాలు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు.తదుపరి కొత్త పాఠశాలను సందర్శించి విద్యా సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు అవసర సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.“పిల్లల ఆరోగ్యం, విద్యపై శ్రద్ధ సమాజ అభివృద్ధికి కీలకం” అని తిరుమలేష్ పేర్కొన్నారు.నరసింహ, అనిల్, భాస్కర్, పరశురాముడు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.












