ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు, పాల్గొన్న మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్.
ప్రజా గొంతుక మార్చి 14 కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు.పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరుల రంజాన్ ఉపవాస పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామనిఅన్నారు. ముస్లిం, హిందువులు కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు సోదరభావంతో కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజల వీణ సదయ్య,సర్పంచ్ బంగారు రమేష్, మాజి జెడ్పిటిసి లంక సదయ్య, ఉపసర్పంచ్ గోలి సుధాకర్, పెగడపల్లి సర్పంచ్ ఆ రెల్లి రమేష్, వైస్ చైర్మన్ సబ్ అని రాయమల్లు, ఇదిలాపూర్ ఉపసర్పంచ్ హరీష్ మాజీ సర్పంచ్ మాదాసు సతీష్, ఓరుగంటి కొమురయ్య గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎండి మునీర్ మాజీ ఎంపిటిసిలు రావి సదానందం, గ్రామ శాఖ అధ్యక్షులు అల్లంల దేవేందర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి రహీం ఖాన్, ఎంగిలి మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.













