గానుగుపహడ్ వంతెన పనులు ప్రరంభించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు - యాసారపు కరుణాకర్
ప్రజా గొంతుక జనగామ హుస్నాబాద్ మార్గం లో గానుగుపహడ్ వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం లో బ్రిడ్జి ల సాధన సమితి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడిన సాధన సమితి అధ్యక్షుడు యాసారపు కరుణాకర్ గానుగుపహడ్ చిటకోడూర్ బ్రిడ్జి లు నిర్మించాలని గత రెండు సంవత్సరాలకు పైగా విడతల వారీగా చేసిన పోరాటాలకు దిగివచ్చిన ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న నిధులు మంజూరు చేయడం తో గానుగుపహడ్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడం జరిగినది అని అన్నారు మరియు చిటకోడూర్ వంతెన కోసం నిధులు మంజూరు చేసి టెండర్ లు పిలిచి పనులు ప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలకు సహకరించిన ప్రజలకు,ఉద్యమకారులకు,అన్ని రాజకీయ పార్టీల నాయకులకు,ఎంఎల్ఏ పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి,జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఏ ఏంసిచైర్మన్,బనుకశివరాజ్,యాదవ్,పాత్రికేయులకు,అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి ఇరుగు సిద్దులు మాట్లాడుతూ జనగామ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ లో మూడు సందర్భాలలో మాట్లాడి అందరూ మంత్రులకు సమస్యను వివరించి జైలు కు పోయిన ఉద్యమకారులను పరామర్శించారు అని అన్నారు.
ఉద్యమకారుల ను సన్మానించిన గానుగుపహాడ్ సర్పంచ్ శానబోయిన అనూష మహిపాల్ మాట్లాడుతూ
బ్రిడ్జి ల నిర్మాణం కోసం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసిన ఉద్యమకారుల మీద పెట్టిన కేసు ల ను తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జనగామ జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు మాట్లాడుతూ ఉద్యమకారులు విడతల వారీగా చేసిన పోరాటాల ఫలితంగా నిధులు మంజూరు అయినాయి అని చిన్న చిన్న పనులకు కూడా ప్రజలు రోడ్డు ఎక్కి నిరసన లు,రిలే నిరాహారదీక్షలు చేయడం,జైలు కు పోయే పరకు నిధులు మంజూరు కాకపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వాలు ఉన్నదే ప్రజల కు సేవ చేయడం కోసమే అని గుర్తు చేశారు.సాధన సమితి .ఈ కార్యక్రమం లో బాల్నే ఉమాపతి గౌడ్,మరబోయిన రాజు,ఉప సర్పంచ్ కొర్ర శంకర్ నాయక్, సుధాకర్ రెడ్డి,జిఏంపీఎస్ జనగామ జిల్లా కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు యాదవ్,దడిగే సందీప్, గంధమల్ల సదానందం,కర్రే కమలాకర్, గొంగళ్ల కుమార్, మాల్గ మహేందర్,గడ్డం హరీష్,జోగు శివ తదితరులు పాల్గొన్నారు.












