హాలియా మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో మంచి నీటి ట్యాంకులు పరిశుభ్రంగా ఉండాలి.......
హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:14
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
కార్యక్రమంలో భాగంగా
హాలియా మున్సిపల్ చైర్పర్సన్ చింతల చంద్రారెడ్డి ఆదేశాలనుసారం
పురపాలక సంఘం హాలియా లోని అన్ని వార్డుల్లో మంచినీటి ట్యాంకుల పరిశుభ్రత లో భాగంగా
ట్యాంకుల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ సిబ్బందితో పిచ్చి మొక్కలను తొలగించి
అదేవిధంగా ట్యాంకు లోపల పేరుకుపోయినటువంటి వ్యర్ధాలను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించి మంచినీటి సదుపాయాన్ని మెరుగుపరిచి
పట్టణ ప్రజలకు మంచినీటిని అందించాలని గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి
ప్రతి 15 రోజులకు ఒకసారి మంచినీటి ట్యాంకులను శుభ్రపరచాలని మున్సిపల్ సిబ్బందికి వివరించడం జరిగింది.












