తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహేశ్వరం నియోజకవర్గ కన్వీనర్ గా ఉమ్మడి ప్రవీణ్ పటేల్ నియామకం
(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 14:)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రం అమీర్ పెట్ గ్రామానికి చెందిన ఇమ్మడి ప్రవీణ్ పటేల్ ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహేశ్వరం నియోజకవర్గంలో కన్వీనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ మరియు యాదాల మహేశ్వర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ మరియు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జ్ ప్రకటించారని ప్రవీణ్ తెలియజేశారు తెలంగాణ ఉద్యమకారులను ఐక్యం చేస్తూ తెలంగాణ పునర్ నిర్మాణం కోసం పనిచేయాలని ఉద్యమకారుల ఆకాంక్ష కోసం పాటుపడాలని తెలియజేశారని ఇమ్మడి ప్రవీణ్ పటేల్ పేపర్ ప్రకటనలో తెలియజేశారు












