అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం = చిన్నారులకు అక్షరాభ్యాసం సర్పంచ్ స్వప్న శ్రీనివాస్ యాదవ్
(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 14:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని అగర్ మియాగూడ గ్రామ సర్పంచ్ బెల్లి స్వప్న శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం తో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసం సర్పంచ్ చేతుల మీదుగా చేయడం జరిగిందన్నారు అంగన్వాడీ కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన హెల్త్ సూపర్వైజర్ శోభారాణి ఏఎన్ఎన్ ఎం మానెమ్మ ఆశ వర్కర్ జ్యోతి అంగన్వాడీ టీచర్ గోసుల బాలమణి తోపాటు వార్డు సభ్యులు లిక్కి జయమ్మ గ్రామ గర్భని తల్లులకు సామూహిక శ్రీమంతాలు తోపాటు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగిందన్నారు అంగన్వాడీ టీచర్ ఆశ వర్కర్ ఆధ్వర్యంలో సర్పంచ్ స్వప్న శ్రీనివాస్ యాదవ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ గర్భని తల్లులు పాల్గొనడం జరిగిందని పేపర్ ప్రకటనలో గ్రామ సర్పంచ్ తెలియజేశారు












