దైవభక్తి చాటుకున్న గోపాల్ నగర్ భక్తులు
భద్రాచలం శ్రీరామకళ్యాణముకు గోపాల్ నగర్ నుండి కోటి తలంబ్రాలు...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో శ్రీరామ భక్తితో భద్రాచలం శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి వడ్లను చేతితో వోలిచినా తలంబ్రాలను స్వామి రామకోటి రామరాజు తో భద్రాచలం కు పంపించారు. ఈ సందర్భంగా వచ్చిన స్వామి రామకోటి రామరాజు కి తలంబ్రాలు అప్పజెప్పి, అనంతరం సర్పంచ్ పేరబోయిన కళ్యాణి పరుశురాములు మాట్లాడుతూ శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించిన విష్ణువు యొక్క ఏడవ అవతారం మరియు ఆదర్శవంతమైన మర్యాద పురుషోత్తముడు. కలియుగంలో ప్రజలు క్షేమం కోసం, ధర్మ స్థాపన కోసం ఆయన నామాన్ని, రామాయణాన్ని ఆశ్రయిస్తారు అన్నారు. వారి కళ్యాణం కోసం తలంబ్రాలు పంపడం ఎంతో సంతోషంగా ఉందని, వారి కృపతో గోపాల్ నగర్ గ్రామ ప్రజలు సంతోషంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేరబోయిన కళ్యాణి పరుశురాములు, ఉపసర్పంచ్ చింతల కర్ణాకర్ ,భక్తులు పాల్గొన్నారు.












