నాయకుడి కుటుంబానికి ఆపదలో అండగా నిలిచిన నాగపురి కిరణ్
ఆపద అంటే నేనున్నాను అంటూ ముందుకొస్తున్న నాగపురి కిరణ్
2,50,000 ఎల్ఓసి అందజేత..
పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలంలోని, నారాయణపురం గ్రామంలో జంగిటి లక్ష్మయ్యకు గుండె సంబంధిత వ్యాధి రావడంతో హైదరాబాదులో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న లక్ష్మయ్యకు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుండగా విషయం తెలుసుకున్న నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ ఎల్ఓసి ద్వారా 2లక్షల 50,000 రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమనరాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గుండెల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. నిరుపేద ప్రజలకు ప్రభుత్వ సహాయం అందించడం ద్వారా వారు ఆరోగ్యం గా కోలుకోని సంతోషంగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదల ముఖాల్లో ఆనందం నింపడంలో ఎంతో ఆనందంఉంటుందనిఅన్నారు .రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు ఏ చిన్న సమస్య వచ్చినా ఆదుకోవడంలో ముందు వరుసలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలకు ఆపద వస్తే తమను సంప్రదించాలని వెంటనే స్పందించి ప్రభుత్వం ద్వారా సాయంఅందజేస్తాననిపేర్కొన్నారు.మండల ఆధ్యక్షుడు నూకల బాల్రెడ్డి,గ్రామ సర్పంచ్ స్వప్న శ్రీనివాస్, జిల్లా యువ నాయకులు జిల్లా సందీప్, మాజీ మార్కెట్ చైర్మన్ రవీందర్ రెడ్డి,ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ జంగిటి నరేష్, ఎక్స్ ఎంపిటిసి మహబూబ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నల్ల మహేందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇస్మాయిల్, ఎస్టీసెల్ అధ్యక్షుడు కూరాకుల రవి,మాజీ సర్పంచ్ బాలకిషన్ గౌడ్,ఎండి గౌస్, మేకల ఉపేందర్ రెడ్డి, దేవరకొండ రమేష్, పెనువెల్లి వెంకటేష్,మ్యకల రమేష్, బొట్టు గణపతి,మండల ఉపాధ్యక్షులుపరదే సత్తయ్య, గ్రామ శాఖఉపాధ్యక్షులు ఉపచారి, వార్డు సభ్యులు జంగిటి సురేష్, జంగిటి సుధాకర్, లాస్య శ్రీకాంత్, గ్రామ నాయకులు జంగిటి రవి ,తిరుపతిరెడ్డి, బుచ్చిరెడ్డి, చంద్రారెడ్డి ,గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు జంగిటి ప్రదీప్, కాన్రాజు ఉపేందర్, జంగితి వినయ్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.












