తాళ్ల పద్మావతి కళాశాలలో ఘనంగా పల్స్ 26 అన్యువల్ డే సందడి
ప్రజా గొంతుక తెలుగు దినపత్రిక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి ప్రసాద్:కాజీపేట్ మండలం టేకులగూడెం 64వ డివిజన్లోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో పల్స్-26 అన్యువల్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాజీపేట్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా వృక్షంలా విస్తరించిన విద్యాసంస్థగా తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. తన సతీమణి పేరిట స్థాపించిన ఈ విద్యాసంస్థ ద్వారా వేలాది మంది విద్యార్థులు వివిధ కోర్సులు పూర్తి చేసి దేశ విదేశాల్లో స్థిరపడేలా చేసిన ఘనత కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం కృషి ఫలితమన్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో దాదాపు 700 మంది విద్యార్థులు చదువుకుంటూ భవిష్యత్లో దేశానికి అవసరమైన ఇంజనీర్లుగా ఎదగబోతున్నారని పేర్కొన్నారు.అనంతరం టాలీవుడ్ గాయకుడు, ఈటీవీ పాడుతా తీయగా టైటిల్ విజేత స్వరంగ్ సినీ పాటలతో అందరినీ అలరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం, డైరెక్టర్లు తాళ్ల వంశీ, చైతన్య, తాళ్ల వరుణ్, వైష్ణవి, ప్రిన్సిపల్ వేలు, వైస్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, భాగ్యలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.












