E-PAPER

జర్నలిజం రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న రజితకు ఘన సన్మానం

Date : 13 March 2026, 6:33 pm Posted By : PRAJA GONTHUKA

జర్నలిజం రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న రజితకు ఘన సన్మానం

జర్నలిజం రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న రజితకు ఘన సన్మానం

మహిళా జర్నలిస్టుగా రాణిస్తున్న రజితను అభినందించిన మున్సిపల్ చైర్మన్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనగామలో జరిగిన కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కడకంచి బాలమణి గారు మహిళలకు పిలుపునిచ్చారు. వివక్షతలేని సమాజం రూపొందాలని, మహిళలు ఐక్యంగా సమస్యల సాధన కోసం పోరాడాలని ఆమె కోరారు.TSUTF రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ గారు మాట్లాడుతూ, మహిళాభ్యున్నతే సమాజ అభివృద్ధికి మూలమని, కాబట్టి మహిళలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగాలని అన్నారు.ఈ సందర్భంగా వివిధ రంగాలలో కృషి చేసిన 75 మంది మహిళలకు సన్మానం చేశారు. బచ్చనపేట రజిత శ్రీనువాస్ కు కూడా సన్మానం చేశారు. జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఆమె తన వంతు సహకారం అందిస్తున్న తీరు ప్రశంసనీయం.కార్యక్రమంలో TSUTF జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రావు, మదూరి వెంకటేష్, FWF రాష్ట్ర నాయకులు శ్రీనివాస రావు, జిల్లా కార్యదర్శులు కృష్ణ, శ్రీనివాస్ కృష్ణ మూర్తి, మహిళా విభాగం నాయకులు గూడ లలిత హిమబిందు, రోజా, మమత, నర్సమ్మ, కవిత, ఎలిజబెత్, మాధవి, నిరంజని, లతో పాటు వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్