గ్యాస్ కొరత పై ఆందోళన వద్దు: మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి
మేడ్చల్ - మల్కాజిగిరి మార్చ్ 13,(ప్రజా గొంతుక ) రాష్ట్రంలో ఎల్.పి.జి గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న దృష్ట్యా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర లతో కలిసి జిల్లాల కలెక్టర్లు,ఎస్.పి లు,పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్.పి.జి గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి గందరగోళానికి గురి కావొద్దని,గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటువంటి గందరగోళం ఏర్పడినందునే రోజు వారిగా 72% బుకింగ్స్ జరుగుతున్నాయని అయితే గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రిలకు,విద్యాసంస్థలకు,వృద్దాశ్రమలకు,ప్రభుత్వ సంస్థలకు ప్రాధన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు. తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం,అక్రమంగా మళ్లించడం ,బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడనందుకు గాను ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు.ఎల్.పి.జి డిస్ట్రిబ్యూటర్లు ఇదే విదంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు,ఎస్.పి లు,పోలీస్ కమీషనర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి, గ్రామీణ 45 రోజులకు ఒకమారు ఎల్.పి.జి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు.అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని,గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస సరఫరా చేస్తామని,ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం సేకరణ కు గన్నీలు,ధాన్యం నిల్వలకు స్పేస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలలో వరి సాగు పెరిగిందని, పంటల స్థితి గతులు ననుసరించి సాగు నీరు అందిస్తూ వైవిధ్యత పంటలను ప్రోత్సహించాలని అన్నారు.అనంతరం మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు జిల్లా కలెక్టర్ విజయేందర్ రెడ్డి కలిసి డిస్ట్రిక్ట్ ఎనర్జీ సప్లయ్ మానిటరింగ్ కమిటీ అధికారులతో సమీక్షిస్తూ బాట్లింగ్ ప్లాంట్ల వద్ద, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద, ఎల్పిజి సరఫరా వాహనాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలిని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎవరైనా వినియోగదారులు ఎల్పిజి సిలిండర్స్ ను బ్లాక్ మార్కెట్ లకు తరలించిన యెడల కట్టినమైన చర్యలు ఉంటాయని అన్నారు. జిల్లా లో 52 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ద్వారా గ్యాస్ సిలిండర్ పంపిణీ జరుగుతుందని వాటి డెలివరి లో ఏవైనా ఆటంకాలు ఎదురైనపుడు జిల్లా లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ హెల్ప్లైన్ నం: 040-29700820 ను సంప్రదించగలరు. గృహ సంబందిత అవసరాలకు సరఫరా చేసే ఎల్పిజి సిలిండర్లను ప్రతిరోజు ఆర్డిఒలు, తహశీలాదార్లు, అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దని, వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని గృహ వినియోగానికి, ఆసుపత్రిలకు, విద్యాసంస్థలకు, వృద్దాశ్రమలకు, ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డియమ్ సివిల్ సప్లయ్ సుగుణ బాయి , జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ, జిల్లా హర్టీకల్చర్ అధికారి శ్రీధర్, ఎల్పిజి జిల్లా కొ- ఆర్డినేటర్, ఎల్పిజి సేల్స్ ఆఫీసర్ సంబందిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.












