5 నెలలుగా వేతనాలు లేవు నిరసనకు ఎన్హెచ్ఎం ఉద్యోగుల హెచ్చరికప్రజా గొంతుక (తెలుగు దినపత్రిక) స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి ప్రసాద్:మంచిర్యాల జిల్లా వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అన్వేష్కు ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ దేవనబోయిన బాపు యాదవ్ వినతి పత్రం అందజేశారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేతనాలు లేక ఇంటి కిరాయి, కరెంట్ బిల్లులు, పాల బిల్లు, పిల్లల బడి ఫీజులు, ఈఎంఐలు చెల్లించలేని దుస్థితిలో ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వెంటనే వాటిని విడుదల చేయాలని కోరారు.ఈ నెల 16లోపు వేతనాలు చెల్లించకపోతే 17వ తేదీ నుంచి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సింగ్ ఆఫీసర్ శివరంజని పాల్గొన్నారు...












