హాలియా మున్సిపాలిటీ 7,8 వ వార్డులలో చెత్త చెదారం తొలగింపు.....
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: మార్చి:13
ప్రజా పాలన పట్టణ ప్రణాళిక 99 రోజుల లో భాగంగా ఈ రోజు హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 7.8 వ వార్డులలో హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది మరియు జేసీబీ డోజర్ ట్రాక్టర్ లతో పేరూరు మేజర్ కాల్వ వెంబడి గల చెత్త చెదారం తీసివేంచుట జరిగినది,అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులతో మురికి కాలువలు శుభ్రం చేయుట.రోడ్ల వెంబడి గల చెట్లు తీపించుట జరిగినది ఇట్టి కార్యక్రమంలో 8 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు మజహర్ మొహియుద్దీన్ కున్రెడ్డి కృష్ణారెడ్డి ఖదీర్ ఎల్లయ్యచారి మహేష్ అల్లాద్దీన్ సత్యంచారి హేమంత్ డి జె మహేష్ వార్డు సభ్యులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగినది












